BHPL: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని MLA గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. ఇవాళ BHPLలో కొనుగోలు కేంద్రాల పనితీరు, ధాన్యం తరలింపు, మిల్లులకు పంపిణీ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.