BHPL: ఉపాధి హామీ కూలీలకు గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని CPI(ML) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. టేకుమట్లలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముఖ గుర్తింపుతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పాత పద్ధతిలోనే కూలీలకు హాజరు వేసి వేసవి అలవెన్సెస్ ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.