BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలం గారిమెళ్లపాడులో అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. జూలూరుపాడు 42.4, దుమ్ముగూడెం 42.3, భద్రాచలం 42.2 డిగ్రీలతో నమోదయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.