MBNR: నగరంలోని 24వ డివిజన్లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి పర్యటించారు. వస్తువులు వాడిన తర్వాత చెత్తను రోడ్లపై వేయకుండా డబ్బాల్లోనే వేయాలని ప్రజలకు సూచించారు. కాలనీ సమస్యలను స్థానిక కార్పొరేటర్ రాధా గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.