HNK: ధర్మసాగర్(M) సాయిపేట గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆకస్మికంగా పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయిపేట గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని, ఇప్పటికే గ్రామ పంచాయతీ భవనం మంజూరు అయిందని, త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మి నాగరాజు, ఉప సర్పంచ్ రాజేందర్ ఉన్నారు.