ఖమ్మం: SRBGNR కళాశాలలో బుధవారం ఐక్యూ ఏసీ, NSS, NCC విభాగాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘రక్తదానం ప్రాణదానంతో సమానం’ అని, అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.