SRPT: కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ పోస్టుల జీతాల వ్యవహారంపై జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శంకర్, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ బుధవారం విచారణ చేపట్టారు. పనిచేస్తున్న పదిమందిలో ఏడుగురికి మాత్రమే జీతాలు ఇస్తూ, మిగతా ముగ్గురికి ఈ ఏడుగురి జీతాల్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు పరస్పర అంగీకారం కుదుర్చుకున్నట్లు సిబ్బంది అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించారు.