మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఆలస్యమవుతున్న ఈ చిత్రం, 2026, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక వశిష్ఠ దర్శకత్వంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.