TG: మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో నేతలు ఎల్. రమణ, వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ చర్చలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరిక, BRS ఆవిర్భావ సభ ఏర్పాట్లపై KCRకు వివరించారు. ఈ భేటీ అనంతరం KTR జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి బయలుదేరారు.