AP: ఆనాడు బాబాయ్‌ని చంపేసి.. ఆ నేరం తనపై వేశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై జగన్ కక్షగట్టారని, ఆనాడు ఆడబిడ్డలను వేధించారన్నారు. డ్రోన్లతో ఆడబిడ్డలను వీడియోలు తీశారని, లాఠీలతో కొట్టించారని ఆరోపించారు. అమరావతి విషయంలో న్యాయం, ధర్మం, చట్టం గెలిచిందన్నారు. అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం చట్టం చేసిందన్నారు. రాజముద్ర కూడా వేసిందని చెప్పారు.