NRPT: మక్తల్ -నారాయణపేట ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాద హెచ్చరిక బోర్డులు వాల్ పోస్టర్ల మయంగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా వివిధ సంస్థలు, వ్యక్తులు తమ ప్రచార పోస్టర్లను బోర్డులపై అతికించడంతో అసలు హెచ్చరికలు కనిపించకుండా పోతున్నాయి. అధికారులు స్పందించి బోర్డులపై ఉన్న పోస్టర్లను తొలగించి, అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.