మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం పీహెచ్సీని డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ సందర్శించారు. రిజిస్టర్లను పరిశీలించి, ఆసుపత్రి ప్రాంగణాన్ని తనిఖీ చేశారు. గర్భిణీలకు మాతృ పోషణ, పరిశుభ్రతపై కౌన్సెలింగ్ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.