MLG: మల్లంపల్లి(M) దేవనగర్ గ్రామ పంచాయతీలో డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ కుమార్, సెక్రటరీ ఉమ పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయులు చూపిన బాటలో మనమంతా నడుస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. పలువురు వార్డు సభ్యులు, తదితరులు ఉన్నారు.