PDPL: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల రైల్వే స్టేషన్ను సందర్శించి అమృత్ భారత్ పథకం పనులను పరిశీలించారు. నాణ్యత, సమయపాలనపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, తాగునీరు, లైటింగ్, పార్కింగ్ మెరుగుపరచాలని, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.