KMM: పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి భారీ స్కెచ్‌తో చోరీకి పాల్పడ్డారు. అయితే వీరు కేవలం నగలు, నగదు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులను, కందిపప్పు, ఉల్లిగడ్డ, గ్యాస్ సిలిండర్‌ను కూడా వదలకుండా ఎత్తుకెళ్లారు.ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.