SRCL: రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎన్డీఎఫ్ నిధులు రూ. 31 లక్షలతో ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో నిర్మించిన ఉప కార్యనిర్వహక ఇంజనీర్, ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్- 4 కార్యాలయ భవనాన్ని సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.