W.G: భీమవరంలోని ఓ ప్రైవేటు కళాశాల ఆడిటోరియంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఇటీవల తమిళనాడులో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ప్రస్తావిస్తూ, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు, ప్రజలకు సూచించారు.