NZB: వేల్పూర్ మండలంలోని మోతేలో 12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన రూ.2.25 లక్షల వ్యయాన్ని దాత అల్లపుల్ల గంగారెడ్డి సమకూర్చారు. సోమవారం విగ్రహ తయారీదారు శిల్పి శ్రీనివాస్‌కు అడ్వాన్స్ చెక్కును అందజేసి పనులను ప్రారంభించారు. యువతకు శివాజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా గ్రామస్థులు కొనియాడారు.