MDK: మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రామాయంపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. నియోజకవర్గానికి ఈ కాలంలో ఒక్క రూపాయి నిధులు రాలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, పాలనను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.