HYD: చర్లపల్లిలో విజయశాంతిరెడ్డి, ఆమె పిల్లలు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై భర్త సురేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అత్త, బామ్మర్ది ఆస్తికోసం కుట్ర పన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ‘నా ఫ్యామిలీ చనిపోయేంత వీక్ కాదు. ఈ ఘటనకు 3గంటల ముందు ఏం జరిగింది. బెడ్రూమ్లో కాలిన పేపర్స్ కనిపించాయి. నేను చనిపోతే ఆస్తి ఏం చేస్తావని అడిగారు. నాకు ప్రాణహాని ఉంది’ అన్నారు.