అత్తారింటి (Attarinti) వేధింపులతో కోడళ్ళు కానీ, ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేయడం ఇప్పటివరకు చూశాం. ఇక్కడ మాత్రం అల్లుడు అత్తారింటిముందు ధర్నా చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తన కన్న పేగును తనకు దూరం చేయ్యొద్దంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు (Kodada)చెందిన రమణి పృథ్వితో హైదరాబాద్ (Hyderabad) చెందిన ప్రవీణ్ కుమార్కు 2018 ఆగస్టులో వివాహమైంది.
అత్తారింటి (Attarinti) వేధింపులతో కోడళ్ళు కానీ, ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేయడం ఇప్పటివరకు చూశాం. ఇక్కడ మాత్రం అల్లుడు అత్తారింటిముందు ధర్నా చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తన కన్న పేగును తనకు దూరం చేయ్యొద్దంటూ వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడకు (Kodada)చెందిన రమణి పృథ్వితో హైదరాబాద్ (Hyderabad) చెందిన ప్రవీణ్ కుమార్కు 2018 ఆగస్టులో వివాహమైంది. వీరి కాపురం అక్టోబర్ 2021 వరకు సజావుగానే సాగింది. వీరికి మూడేళ్ల కౌటిల్య కార్తికేయన్ అనే బాబు ఉన్నాడు. కానీ ఏమైందో తెలియదు కానీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఏడాదిన్నర క్రితం బాబుతో కోదాడలోని తన పుట్టింటికి రమణి పృథ్వి వచ్చేసింది. దీంతో ప్రవీణ్ కుమార్ (Praveen kumar) కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును(family court) ఆశ్రయించగా.. వారానికోమారు తండ్రీకొడుకులు కలుసుకునేందుకు వీలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు(court orders) జారీ చేసింది.
ఏడాదిన్నరగా తన కొడుకును చూసుకునేందుకు ప్రవీణ్ (Praveen) ఎన్నిమార్లు ప్రయత్నించినా అత్తామామలు కుదరనివ్వలేదు. దీంతో తన కొడుకును తనకు చూపించాలంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్ అత్తారింటి ముందు ధర్నాకు దిగాడు. కొడుకు (Son) కోసం కొన్న ఆట వస్తువులను ప్రదర్శిస్తూ అత్తామామల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. కొడుకును చూపించకుండా అత్తమామలు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. పిల్లల మధ్య అభిప్రాయ భేదాలతో గొడవలు ప్రారంభమయ్యాయని ప్రవీణ్ తండ్రి చెబుతున్నారు. వీరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించే ప్రయత్నం తన కోడలు తల్లిదండ్రులు ఏమాత్రం చేయలేదని ప్రవీణ్ తండ్రి చెబుతున్నారు. కోర్టు ఆదేశం (court order) ప్రకారం తమ మనమడిని తమకు చూపించకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.