శృంగారం అనేది సహజమైన చర్య. ఇది ఒకరు బలవంతపెడితేనో, మరొకరు ప్రేరేపిస్తేనో కలిగే భావన కాదు. అడవిలో నివసించే జంతువుల నుంచి జనావాసాల్లో నివసించే సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని తమ జీవితంతో అనుభవించక తప్పదు. తాజాగా తెరమీదకు వచ్చింది. అది కూడా భారత అత్యున్నత హోదా కలిగిన సివిల్ సర్వీస్ అందించే ఐఏఎస్ ఆఫీసర్.ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) జిల్లాలోని కోర్బా జిల్లా సెషన్స్ కోర్టు 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha)పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను తెలిపింది. సందీప్ కుమార్ ఝా తెలంగాణ కేడర్(Telangana Cadre)కు చెందిన ఐఏఎస్ అధికారి.
ఈయన సొంత స్థలం బిహార్లోని దర్భంగా జిల్లా. ఈ అధికారిపై తాజాగా ఆయన భార్య గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారం చేయమని బలవంతం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.ఈ విషయంలో ఛత్తీస్ గఢ్లోని కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఐఏఎస్ భార్య కోర్టును ఆశ్రయించారు. న్యాయవాది శివనారాయణ్ సోనీ(Shivanarayan Soni) ఈ విషయాన్ని న్యాయమూర్తి ముందు ఉంచారు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పెర్కోన్నది. బాధితురాలు ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో బిహార్(Bihar)లోని దర్భంగాకు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాతో బాధితురాలికి వివాహం జరిగింది. పెళ్లికి ముందు తర్వాత కూడా అతడు వరకట్నం కోసం నిరంతరం వేధించారు.
భర్త సందీప్ ఝా వరకట్న వేధింపులు(Dowry harassment), తనపై దాడి, అసహజ లైంగిక సంబంధాలపై ఆయన భార్య ఆరోపిస్తూ కంప్లీట్ చేశారు. వివాహం జరిగినప్పటి నుంచి నగదు, ఆభరణాల విషయంలో నిరంతరం ఒత్తిడి ఏర్పడింది. పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయినా ఐఏఎస్(IAS)కుటుంబం వరకట్నం డిమాండ్ చేస్తుంది. కనీసం 50 తులాల బంగారు, వెండి ఆభరణాలు, బ్రాండెడ్ బట్టలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ఫర్నీచర్ వంటి వాటిని ఇచ్చాం’’ అని ఫిర్యాదులో ఆయన భార్య పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్బా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు(Registration of FIR) చేయాలని కోర్టు ఆదేశించింది.దేశ అత్యున్నత, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారే ఇలా విచక్షణ కోల్పోతే సగటు మానవునికి ఏమని సందేశం ఇవ్వగలరు. ఇందుకేనా అంతటి గొప్ప చదువును అభ్యసించింది అని పలువురు విమర్శిస్తున్నారు.