»Line Clear For Pawan Kalyan Varahi Yatra Tomorrow In Ap Today Evening Goes To Annavaram
Pawan kalyan: రేపు పవన్ వారాహి యాత్రకు లైన్ క్లియర్..ఈరోజు సాయంత్రం అన్నవరానికి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra)కు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో వైసీపీ(ysrcp) ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.
వారాహి వాహనానికి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భారీ సభ అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నుంచి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని జనసేన నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. పవన్ కల్యాణ్(Pawan kalyan) జనసేన పార్టీ ఆధ్వర్యంలో రేపటి(జూన్ 14) నుంచి వారాహి యాత్ర(Varahi Yatra) ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే ఈరోజు పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం చేరుకోనున్నారు. రత్నగిరి కొండపై పవన్ రాత్రి బస చేయనున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రికి పవన్ కళ్యాణ్ బస చేయనున్న పల్లవి గెస్ట్ హౌస్ లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఆ తర్వాత రేపు సాయంత్రం కత్తిపూడిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను జనసేన ప్రత్తిపాడు ఇంచార్జి వరుపుల తమ్మయ్యబాబు, ఇతర నాయకులు ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు అన్నవరం కొండపై భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ సభలు, ప్రసంగాలు, పార్టీ జెండాలు తీసుకురావద్దని ఈఓ ఆజాద్ కోరారు. ఆలయం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని ఈఓ(temple EO) సూచించారు.
అయితే మరోవైపు కోనసీమ జిల్లా(konaseema district) అమలాపురం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. పైగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేపు ప్రారంభం కానున్న పవన్ వారాహి యాత్రకు మినిట్ టు మినిట్ కార్యక్రమం వివరాలు చెప్పలేదని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు పవన్ పర్యటన గురించి హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే జూన్ 14న ప్రత్తిపాడు, జూన్ 16న ఉప్పాడలో జరగనున్న కార్యక్రమాలకు కావాల్సిన అన్ని తమ పార్టీ పొందినట్లు జనసేన నేతలు చెబుతున్నారు.
JanaSena Chief Shri @PawanKalyan Varahi Yatra public meetings details.