NLG: జిల్లా పరిధిలోని ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు గాలికొదిలేయడంపై ప్రజలు మండి పడుతున్నారు. గతంలో ప్రతినెలా క్రమం తప్పకుండా జరిగే ‘డయల్ యువర్ ఆర్ఎం’ కార్యక్రమం గత మూడు నెలలుగా నిర్వహించడం లేదు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక జనాలు అయోమయంలో పడ్డారు. గతంలో నెలకోసారి జరిగే ఈ కార్యక్రమం ద్వారా నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేవారు.