SRD: మహిళల సాధికారతకు ఉపాధి ఎంతో కీలకమని సబ్ కలెక్టర్ ఉమా హారతి పేర్కొన్నారు. మంగళవారం ఖేడ్లో ICDS ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కుట్టు శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా ఆర్థిక లాభాలు కూడా సాధించగలరని చెప్పారు. ఇందులో DWO లలిత కుమారి, CDPO సుజాత, పల్లవి ఉన్నారు.