SRCL: సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు బస్సులు పెంచాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని బస్ డిపోలో డిపో మేనేజర్ ప్రకాష్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు సరిపోయే అన్ని బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.