RR: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ మరోసారి స్పందించారు. తాను కేవలం డిన్నర్‌కు మాత్రమే హాజరయ్యానని, ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో తన పేరు రావడంపై విచారం వ్యక్తం చేస్తూ, పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని.. త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.