ASF: కాగజ్ నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీలో లక్షల వ్యయంతో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ కరువై నిరుపయోగంగా మారాయి. తలుపులు విరిగి, చెత్త పేరుకుపోవడంతో పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. నీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టి, నీటి సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.