SDPT: సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డ 12 మంది మందుబాబులకు సోమవారం జిల్లా కోర్టు భారీ జరిమానా విధించింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడటంతో, వారిని న్యాయమూర్తి కాంతారావు ముందు హాజరుపరిచినట్లు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరికి మొత్తం రూ. 1,11,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువడిందని ఆయన పేర్కొన్నారు.