GDWL: గద్వాలకు సమీపంలోని జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే అమ్మవారికి కృష్ణానదీ జలాలతో అభిషేకం చేసి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అర్చన, ఆకుపూజ, హోమం తదతర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి సారెలు సమర్పించారు.