WGL: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం మహిళా కూలీల రాష్ట్ర శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన దర్శిని రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్ హాజరై మాట్లాడారు. మహిళా కూలీల హక్కులు, అవగాహన, నైపుణ్యాల పెంపుదలే లక్ష్యంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.