SRCL: జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి డా. బి. జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించే ముందు సంబంధిత పాఠశాలకు ప్రభుత్వ అనుమతి ఉందో లేదో నిర్ధారించుకొని మాత్రమేపంపించాలని అన్నారు.