BHNG: రాజపేట మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన దళిత హక్కుల పోరాట సమితి డీహెచ్‌పీఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షురాలుగా ఇంజ హేమలత ఎన్నిక అయ్యారు. దళిత హక్కుల పోరాట సమితి భువనగిరి జిల్లా రెండవ మహా సభల మోత్కూరు మండలంలో జరుగగా ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. హేమలత సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేసే నేత అని పేర్కొన్నారు.