SRD: కంగ్టి మండలోని చందర్ తండాలో ఉపాధి హామీ పనులను ఎంపిడిఓ సత్తయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. మొత్తం 60 మంది కూలీలు పనిచేస్తున్నారని చెప్పారు. మిగతావారు కూడా ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యదర్శి హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.