MBNR: జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో HYDకు చెందిన సర్కార్(13) అనే బాలుడు ఆరో తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. కాగా గురువారం సాయంత్రం పాఠశాలలో మొదటి అంతస్తుపై నుంచి కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.