MNCL: గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం చెన్నూర్‌లోని గోదావరి నది తీరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి పుష్కర ఘాట్ ఏర్పాటు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కరాలలో భక్తుల సంఖ్య అంచనా ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.