MNCL: గోమాతను కాపాడాలని జగిత్యాల జిల్లాలోని బుగ్గారం గోశాల నిర్వాహకులు అగస్త్య మహారాజ్ కోరారు. గోవులను సంరక్షించాలని కోరుతూ మహారాజ్ చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం జన్నారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు భక్తులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ లక్ష్యంగా మార్చి 21న జగిత్యాల నుంచి కేదార్నాథ్ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.