NRPT: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ పట్టణంలోని బస్ డిపో, బస్టాండ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బస్సుల రాకపోకలపై డిపో మేనేజర్ లావణ్యతో చర్చించి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విధులకు హాజరయ్యే కార్మికులకు పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు.