NZB: కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని తక్షణమే పెంచాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మేయర్ నీతూ కిరణ్ (ఉమారాణి) లతో కలిసి ఆయన 591 మంది లబ్ధిదారులకు రూ. 5.91 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.