KMR: తాడ్వాయి మండల పరిధిలోని దేవాయిపల్లి గ్రామ సరిహద్దులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. లింగంపేట్ మండలం బాణపూర్ గ్రామానికి చెందిన 15 మంది కలిసి ఆటోలో ముత్యంపేటలో జరుగుతున్న ఒక శుభకార్యానికి బయలుదేరినట్లు తెలిసింది.