MHBD: 2025 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన “కఠినసేవా” పతకానికి గార్ల బయ్యారం సీఐ లోడిగ రవీందర్ ఎంపికయ్యారు. శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ చేతుల మీదుగా ఆయన పతకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ శబరీష్ సీఐ రవీందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ సంఘం సభ్యులు సైతం సీఐను అభినందించారు.