కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జవాన్‌గా పనిచేస్తున్న షరీఫ్ మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే ఆయన మృతి పట్ల మున్సిపల్ వర్గాల్లో విషాదం నెలకొంది. అధికారులతో పాటు కౌన్సిలర్లు శ్రీనివాస్, సుధాకర్, సునీల్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.