KMR: పల్వంచ మున్నూరుకాపు సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తోట పెద్దోళ్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా తోట భూమొల్ల నర్సింలు, కోశాధికారిగా తోట పెద్దోళ్ల శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా భూమొల్ల హరీష్, సహాయ కార్యదర్శిగా తోట భూమొల్ల బాలరాజులను ఎంపిక చేశారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సభ్యులు పేర్కొన్నారు.