GDWL: పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మినీ డైరీ పథకం కింద ఎంపికైన 44 మంది రైతులు గేదెల కొనుగోలు కోసం ఉత్తరప్రదేశ్ వెళ్తున్న వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు.