VKB: కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో దౌల్తాబాద్ మండల కేంద్రానికి చేరుకున్న సీఎంకు మంత్రి వాకిటి శ్రీహరి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహమెహ్రా, కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ స్వాగతం పలికారు.