SDPT: సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పోస్టర్ను జిల్లా అదనపు కలెక్టర్ కె. లక్ష్మీకిరణ్ ఆవిష్కరించారు. జూన్ 6,7 తేదీలలో రాజమహేంద్రవరంలో జరిగే మహాసభలు తెలుగు భాష, సాహిత్య వికాసానికి దోహదపడతాయని తెలిపారు. కన్వీనర్ నారోజు వెంకటరమణ మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి కవులు, రచయితలు పాల్గొంటారని, సాహిత్య చర్చలు, సమ్మేళనాలు ఉంటాయన్నారు.