RR: ఇబ్రహీపట్నంలోని మంచాల మండలం రంగాపూర్ గ్రామంలో ఎస్టీ మినీ గురుకుల (బాలికల) హాస్టల్లో 2026- 27 సంవత్సరానికి గానూ 1వ తరగతి, 2వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ ప్రతిభ తెలిపారు. గిరిజన బాలికల తల్లిదండ్రులు పిల్లల ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.