CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు చేసి అవుటయ్యాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి, దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, కోహ్లీ 6 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను అంతకుముందే దూబే జారవిడిచాడు. వచ్చిన ఆ అవకాశాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.