నాగర్‌కర్నూల్ ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్ష ఎన్నికల్లో బిలకంటి హరిబాబు 135 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి వాసా రమేష్‌పై ఆధిక్యం సాధించి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. వాసవికన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.