VKB: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి కరణం కీర్తి రామకృష్ణ ప్రకటించారు. గురువారం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం కోల్కుంద గ్రామంలో ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. సర్పంచుల సమస్యల పరిష్కారం కోసమే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.